Home » Eknath Shinde
మహారాష్ట్రలో ప్రారంభించిన 8 నెలలకే ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల భారీ విగ్రహం కుప్పకూలింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాకరేలు సీఎం ఏక్నాథ్ షిండేను శనివారంనాడు వేర్వేరుగా కలుసుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.
మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే)-ఎ్‌ససీపీ (అజిత్) పార్టీల కూటమి అయిన ‘మహాయుతి’ ఘనవిజయం సాధించింది.
ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తరలిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే లగేజీని ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు.
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.
రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్‌ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్‌తో షిండే మాట్లాడి ఖాన్‌కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పోటీ చేసే స్థానంపై స్తబ్ధత నెలకొంది. గత ఎన్నికల్లో కల్యాణ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ కేటాయింపుపై కూటమి బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే కల్యాణ్ లోక్ సభ నుంచి అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది.
బాలీవుడ్ నటుడు గోవిందా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో గల శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభ సీటు నుంచి గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది.