Share News

Maharashtra Elections: సీఎం బ్యాగ్‌ను కూడా వదిలిపెట్టని అధికారులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:44 PM

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంపై ఈసీ ఘట్టి నిఘా వేసింది. ప్రచారంలో పాల్గొంటున్న ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా అధికారులు వారి బ్యాగేజీలను తనిఖీ చేస్తున్నారు.

Maharashtra Elections: సీఎం బ్యాగ్‌ను కూడా వదిలిపెట్టని అధికారులు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏ ఒక్క నేతను వదిలి పెట్టకుండా ఈసీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తు్న్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సైతం తాజాగా ఆ జాబితాలోకి వచ్చి చేరారు. పాల్ఘర్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద బుధవారంనాడు ఆయన హెలికాప్టర్ దిగగానే ఎన్నికల కమిషన్ అధికారులు ఆయన బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Maharashtra Elections: డిప్యూటీ సీఎం హెలికాప్టర్, బ్యాగులు తనిఖీ చేసిన ఈసీ


తొలుత శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు సోమవారంనాడు తనిఖీ చేయడంతో వివాదం మొదలైంది. లూతూరులో తన బ్యాగులను తనిఖీ చేశారని థాకరే వెల్లడిస్తూ, ఇదే చట్టం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి మోదీకి, ఇతర అధికార కూటమి నేతలకు వర్తిస్తుందా అని ప్రశ్నించారు. పింక్ జాకెట్ వేసుకున్న వ్యక్తికి (అజిత్ పవార్), డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌కు సైతం ఈ చట్టాన్ని వర్తింపజేస్తారా అని వనిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో థాకరే నిలదీశారు.


తప్పేంటి?: ఫడ్నవిస్

కాగా, థాకరే స్పందనపై ఫడ్నవిస్ ఘాటుగా స్పందించారు. బ్యాగులు తనిఖీ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ స్థాయిలో కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికల అధికారుల ప్రొసీజర్ ఎవరికైనా వర్తిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఫడ్నవిస్ బ్యాగేజీని కొల్హాపూర్ విమానాశ్రయంలోనూ, అజిత్ పవార్ బ్యాగేజీని బారామతిలోనూ బుధవారంనాడు ఈసీ అధికారులు తనిఖీ చేశారు. ఆ వీడియోలను ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.


ఇవి కూడా చదవండి

Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్

నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 04:46 PM