Maharashtra Results: లక్షా 20 వేల ఆధిక్యంతో సీఎం షిండే గెలుపు
ABN , Publish Date - Nov 23 , 2024 | 07:25 PM
కొప్రి పచ్పఖాడి నియోజకవర్గంలో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచిన అనంతరం షిండే మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరే శివసేన ఏదో ఈరోజు ప్రజలే తీర్పుచెప్పారని అన్నారు. కామన్‌మెన్‌ను సూపర్‌మెన్ చేయాలన్నదే తమ కోరిక అని అన్నారు.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) భారీ ఆధిక్యత సాధించారు. 1,20,717 ఓట్ల ఆధిక్యతతో కొప్రి-పచ్పఖాడి (Kopri Pachpakhadi) అసెంబ్లీ నియోజకర్గాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు. షిండేకు 1,59,060 ఓట్లు రాగా, ఆయన సమీప శివసేన (యూబీటీ) ప్రత్యర్థి కేదార్ డిఘేకు 38,342 ఓట్లు పోలయ్యాయి. షిండే రాజకీయ గురువైన ఆనంద్ డిఘే మేనల్లుడే కేదార్ డిఘే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి షిండే కాంగ్రెస్ అభ్యర్థి ఘసిగోంకర్ సంజయ్ పాండురగంగపై విజయం సాధించారు.
PM Modi: 'మహా' విజయంపై మోదీ ఫస్ట్ రియాక్షన్
కామన్‌మెన్‌ను సూపర్‌మెన్ చేశాం..
కొప్రి పచ్పఖాడి నియోజకవర్గంలో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచిన అనంతరం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరే శివసేన ఏదో ఈరోజు ప్రజలే తీర్పుచెప్పారని అన్నారు. తమది కామన్‌మెన్ ప్రభుత్వమని, మహిళలు, పిల్లలు, రైతుల అభ్యున్నతిని కోరే ప్రభుత్వమని, కామన్‌మెన్‌ను సూపర్‌మెన్ చేయాలన్నదే తమ కోరిక అని అన్నారు. తన వరకూ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, కామన్‌మెన్ అని చెప్పారు. మహాయుతి ప్రభుత్వానికి ఇది తిరుగులేని విజయమని, మహారాష్ట్ర ప్రజలకు, తమకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రధానమంత్రికి తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
ప్రమాణస్వీకారం ఎప్పుడు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయానంతరం 'మహాయుతి' నేతలు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ సోమవారంనాడు వాంఖడే స్టేడియంలో మహాయుతి నేతల ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..