Home » Eknath Shinde
శివసేన ఉద్ధవ్ థాకరే, శివసేన షిండే వర్గాలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలకమైన తీర్పును ప్రకటించనున్న నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేశారు.''మాకు మెజారిటీ ఉంది'' అని ధీమా వ్యక్తం చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తన తీర్పు వెలువరించడానికి ముందే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలుసుకోవడం కలకలం రేపింది. ఈ పరిణామంపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.
ఉద్ధవ్ ఠాక్రే(Uddav Tackrey) శివసేన(Shivsena) వర్గంపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై తాజాగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం చీఫ్ మీనాతాయ్ కాంబ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గంలో చేరారు. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
ఈసారి దసరా ర్యాలీని ముంబై చారిత్రక శివాజీ పార్క్ గ్రౌండ్లో నిర్వహించాలనుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన వర్గం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ర్యాలీ కోసం బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కోరుతూ సమర్పించిన దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శివసేన వైరి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ విచారణ చేపట్టడంతో జర్మనీ, బ్రిటన్ దేశాల్లో జరపదలచిన పర్యటనను ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వాయిదా వేసుకున్నారు. విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ సోమవారంనాడు విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరుకావాలని 53 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇటీవల నోటీసులు పంపారు.
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధరాశివ్‌గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం పేర్ల మార్పుపై స్థానికుల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించింది.
మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, సెప్టెంబర్ కల్లా మార్పులు ఉంటాయని, సీఎం సీటు ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ శనివారంనాడు జోస్యం చెప్పారు.