Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి షిండే శివసేన రూ.11 కోట్ల విరాళం
ABN , Publish Date - Jan 06 , 2024 | 08:40 PM
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.
అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి (Ayodhya Ram Mandir) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన (Shiv sena) రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు. మహారాష్ట్ర ప్రజలు, శివసేన తరఫున రామాలయానికి ఈ విరాళం ఇచ్చామని, చెక్ అందజేసేందుకు అయోధ్యకు వచ్చామని రాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ ఈ సందర్భంగా తెలిపారు.
ఉదయ్ సావంత్, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) ఎంపీ శ్రీకాంత్ షిండే తదితరులు అయోధ్యకు వచ్చి రూ.11 కోట్లు విరాళం అందజేయడం సంతోషంగా ఉందని చంపత్ రాయ్ తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలోని రామాలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు.