• Home » Election Campaign

Election Campaign

SAVITA : ఇసుక దొంగలు వస్తున్నారు జాగ్రత్త..!

SAVITA : ఇసుక దొంగలు వస్తున్నారు జాగ్రత్త..!

పెనుకొండ నియోజకవర్గ ప్రజలారా ఇసుక దొంగలు వస్తున్నారు... తస్మాత జాగ్రత్త... అని ్డ్డ్డటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత హెచ్చరించారు. ఆమె బుధవారం మండల పరిధిలోని వైటీరెడ్డిపల్లి, రంగాపు రం, దొడగట్ట, డీఆర్‌ కొట్టాల, రెడ్డిపల్లి, గోనిమేకలపల్లి, పెద్దగువ్వలపల్లి, ఆర్‌ కొట్టాల ఆర్‌ మరువపల్లి, రొద్దం, తిమ్మాపురం, బూదిపల్లి, శేషాపురం, కలిపి, కె మరు వపల్లిల్లో బీకే పార్థసారథితో కలిసి రోడ్‌షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... కళ్యాణ దుర్గం నుంచి వలస పక్షి ఉశశ్రీ వచ్చిందని, అక్కడి ఇసుకంతా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుం దని విమర్శించారు.

BALAYYA : పురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా

BALAYYA : పురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తా

నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం గోళ్లాపురం, తూ ముకుంట, సంతేబిదునూరు, కొటిపి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ హయాంలో తూముకుంట పారిశ్రామికవాడకు పరిశ్రమలు తెచ్చామన్నారు. దీనివల్ల హిందూపురం మండలంలో భూముల విలువ అమాంతం గా పెరిగి రైతులకు మేలు జరిగిందన్నారు.

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి

TDP: సైకిల్‌ గుర్తుకు ఓటేయండి: అశ్మితరెడ్డి

ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయినబజారు, చిన్నబజారులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

GUMMANURU: వైసీపీ పనైపోయింది: జయరాం

GUMMANURU: వైసీపీ పనైపోయింది: జయరాం

ఎన్నికల్లో వైసీపీ పని అయిపోయిందని, మరో వారంలో ప్యాకప్‌ తప్పదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు జయరాం సమక్షంలో టీడీపీలో చేరారు.

KALAVA CAMPAIN: రెండు పంటలకు నీరందిస్తాం: కాలవ

KALAVA CAMPAIN: రెండు పంటలకు నీరందిస్తాం: కాలవ

టీడీపీ అధికారంలోకి రాగానే ఉంతకల్లు రిజర్వాయర్‌ను పదేళ్లలో నిర్మించి రైతులకు రెండు పంటలకు నీరందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. బుధవారం బొమ్మనహాళ్‌ మండలంలోని హొసళ్లి, వన్నళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, సింగానహళ్లి, గోనేహాళ్‌, కణేకల్లు మండలంలోని బెణెకల్లు, ఉడేగోళం, మారెంపల్లి గ్రామాల్లో కాలవ రోడ్‌షో నిర్వహించారు.

AMILENI ROADSHOW: చేతకాని మాటలు మాట్లాడే వాడే.. డేరాబాబా

AMILENI ROADSHOW: చేతకాని మాటలు మాట్లాడే వాడే.. డేరాబాబా

చేతకాని మాటలు మాట్లాడేవాడే డేరాబాబా అని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడుపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. మండలంలోని ఎస్‌ కోనాపురం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ముప్పులకుంట, పిల్లలపల్లి, సూగేపల్లి, కోనాపురం, సంతే కొండాపురం, ఎర్రకొండాపురం, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో అమిలినేని ప్రచారం చేశారు.

KESHAV: ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానించాం

KESHAV: ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానించాం

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ సమీపంలో బుధవారం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకురాలు సరస్వతమ్మ అధ్యక్షత వహించారు. కేశవ్‌ మాట్లాడుతూ మన తలరాతలను మనమే రాసుకునే రోజు మీ చేతుల్లోనే ఉందన్నారు.

AP Elections: జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు: గద్దె రామ్మోహన్

AP Elections: జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టారు: గద్దె రామ్మోహన్

Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్

Loksabha polls 2024: మోదీ ఆరడుగుల బుల్లెట్..: బండి సంజయ్

Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.

PM Modi Live:: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న మోదీ..  బహిరంగసభలో ప్రధాని ప్రసంగం..

PM Modi Live:: వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న మోదీ.. బహిరంగసభలో ప్రధాని ప్రసంగం..

కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. వేములవాడ , వరంగల్‌లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి