• Home » Election Campaign

Election Campaign

election: ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడండి

election: ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడండి

జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక లు నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుం ట అంజినప్ప.. జి ల్లా ఎన్నికల పోలీ సు పరిశీలకుడు ఇమ్నాలెన్సాను కోరా రు.

STICKER : బలవంతంగా ఇళ్లకు సిద్ధం స్టిక్కర్లు

STICKER : బలవంతంగా ఇళ్లకు సిద్ధం స్టిక్కర్లు

లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో రెండు మూడు రోజులుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తు న్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చీఫ్‌ ఎలెక్షన ఏజెంట్‌ జేఈ అనిల్‌కుమార్‌ మంగళవారం పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంవద్ద హిందూపురం ఎన్నికల రిటర్నిం గ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ను కలిశారు.

POSTAL BALLET : ఆలస్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

POSTAL BALLET : ఆలస్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

స్థానిక కొట్నూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకే ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్‌ ఉందని తెలిసినా పది గంటల వరకు పోలింగ్‌ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. మరోపక్క ఉద్యోగులు తమ ఓటు హక్కుకు వినియోగించుకునేందుకు ఉదయం 9 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. వచ్చిన వారికి కనీసం పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీని వలన మహిళా ఓటర్లు సుమారు మూడు గంటల పాటు చెట్ల నీడనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.

SAVITA : ఓటమిభయంతోనే వైసీపీ అరాచకాలు

SAVITA : ఓటమిభయంతోనే వైసీపీ అరాచకాలు

ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, పెను కొండలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సందర్భంగా వారు అనుసరించిన విధానమే అందుకు నిదర్శనమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. ఆమె మంగళవారం మండలంలోని గుట్టూరు, వెంకటగిరిపా ళ్యంలో భారీ జనసందోహం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా సవితకు పూల వర్షం కురిపించారు.

BALAYYA: వైసీపీ అరాచకాలను అరికడదాం

BALAYYA: వైసీపీ అరాచకాలను అరికడదాం

రాష్ట్రంలో ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి వైసీపీ అరాచకాలను అరికడదామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మంగళ వారం పట్టణంతో పాటు రూరల్‌ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాల నంతా అరాచకాలు, అఘాయిత్యాలతో సాగిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింద న్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్ర జలకు ఎంతగానో అండగా నిలుస్తాయన్నారు.

TDP ROADSHOW: అభివృద్ధి చూసి ఓటు వేయండి: అశ్మితరెడ్డి

TDP ROADSHOW: అభివృద్ధి చూసి ఓటు వేయండి: అశ్మితరెడ్డి

టీీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటువేయాలని టీడీపీ, కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని వరదాయపల్లి, ధర్మాపురం, పెద్దపప్పూరు గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి మండలంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు.

KESHAV : టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం

KESHAV : టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం

టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. పట్టణంలోని సత్యం కన్షెనల్‌ హాల్‌లో మంగళవారం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు మునువు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

GUMMANURU: టీడీపీలోనే అన్ని కులాలకు సమన్యాయం: జయరాం

GUMMANURU: టీడీపీలోనే అన్ని కులాలకు సమన్యాయం: జయరాం

టీడీపీలో మాత్రమే అన్ని కులాలకు సమన్యాయం లభిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం ఉదయం పాతగుంతకల్లులోని కనకవీటి వీధిలో పెద్ద సంఖ్యలో కురుబలు టీడీపీలోకి చేరారు. దాదాపు 70 కుటుంబాలు జయరాం సమక్షంలో పార్టీ కండువాలు ధరించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

KALAVA CAMPAIN: ఇంటింటికీ ఉచిత కొళాయి కనెక్షన

KALAVA CAMPAIN: ఇంటింటికీ ఉచిత కొళాయి కనెక్షన

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఉచిత తాగునీటి కనెక్షన అందిస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం డీ.హీరేహాళ్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర ్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను అందించి ఓటు వేయాలని కోరారు.

AMILINENI: కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చుతాం

AMILINENI: కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చుతాం

కళ్యాణదుర్గం ప్రజల కలలను నెరవేర్చడమే తన మొదటి కర్తవ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి