Home » Election Campaign
టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ పట్టనుందని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం శెట్టూరు మండల చింతర్లపల్లి, ముచ్చర్లపల్లి, చౌళూరు, కనుకూరు, మల్లేటిపురం, అనుంపల్లి, రంగయ్య పాల్యం, ములకలేడు గ్రామాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతాయన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి, ఇంద్రావతి, పెద్దముష్టూరు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి స్వగ్రామమైన రాకెట్లలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
టీపీపీతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీపీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని జీవీ పాళ్యం, గోవిందాపురం, కదిరే పల్లి, వైబీ హళ్లి, మెళవాయి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులకు గ్రామా ల్లో అడుగడుగునా మహిళలు, రైతులు, ప్రజలు బహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వా మి మాట్లాడుతూ... ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ రాక్ష సపాలన సాగిందన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, సంక్షే మం పరుగులు పెడతాయని టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి అన్నారు. ఆమె శుక్రవారం పట్టణంలోని బోయపేట, విద్యానగర్, కోట ప్రాంతంలో ఎన్నిక ల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడోసారి బాలకృష్ణను గెలిపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పురం ప్రశాంతంగా, అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందన్నారు. పురంలో టీడపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో చేసిన పని ఎక్కడైనా కనబడుతోందా అని ప్రశ్నించారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభి వృద్ధి మాత్రమే గ్రామాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తోందని, వైసీపీ పా లనలో జరిగిన అభివృధ్ధి శూన్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత అన్నారు. గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ గ్రామాల్లో శుక్ర వారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన ఎ న్నికల మేనిఫెస్టో పట్ల, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, అడుగడగున తమకు అండగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు సైతం ఉత్సహం చూపుతూ ముందుకు సాగుతున్నారన్నారు.
ప్రజలు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) వెన్నులో నుంచి భయం తెప్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నామినేషన్ల పక్రియ ముగిసిన నేపథ్యంలో పోటీలో నిలబడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో, గ్రామ, మండల స్థాయి నాయకులు హైదరాబాద్లో ఉండే గ్రామీణ ఓటర్లపై దృష్టి సారించారు.
ఉత్తర తెలంగాణ..! ఒకప్పుడు మావోయిస్టుల కోట! ఉద్యమాల పురిటి గడ్డ! ఈ ప్రాంతం పేరు చెప్పగానే జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి గుర్తుకొస్తాయి! కానీ, ఇప్పుడు అక్కడ కొత్త సిద్ధాంతం పురుడు పోసుకుంటోంది. కమ్యూనిజం స్థానంలో కాషాయ దళం చిగురు తొడుగుతోంది! క్రమక్రమంగా బీజేపీ పట్టు
కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం