Home » Election Commission of India
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ లోక్సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
Andhrapradesh: జనసేన గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే మే నెలలో పెన్షన్కు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంపైనా సీఈసీకి మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ( AP Elections 2024)ల్లో కీలక ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ల స్వీకరణ గడువు ఏప్రిల్ 25వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.
వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి (Election Commission) తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం నాడు సచివాలయంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ పోలీసులపై కేంద్ర ఎన్నిల సంఘం వేటు వేసింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి సహకరించారని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి తీసుకురావడంతో ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ రామాంజనేయులపై బదిలీ వేటు వేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు ఎన్నికల సంఘాని (Election Commission) కి ఫిర్యాదు చేశారు. మంగళవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిశారు.
Andhrapradesh: ఎన్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని..
ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏబీఎన్తో మాట్లాడుతూ... వలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చెయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.దీని ప్రకారం రాష్ట్రప్రభుత్వం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసిందని సూచించారు.