Home » Enforcement Directorate
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును 37వ నిందితుడుగా చేర్చింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పేర్కొంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే మద్యం కుంభకోణంలో తన భర్తను ఈడీ అరెస్టు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు.
Telangana: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేపై ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు మహిపాల్ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేశారు.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ప్రతిపక్ష నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగుస్తున్న వేళ.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐకు భారీ షాక్ తగిలింది. కేరళలో(Kerala) సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సీజ్ చేసింది.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖకు అపరిమిత అధికారాలు కట్టబెట్టాలంటూ ఆ శాఖ ఐజీ రఘురామిరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూలై 8కి వాయిదా వేసింది.
మైనింగ్ పేరుతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి(Gudem Mahipal Reddy) అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఎమ్మెల్యే ఇల్లు, ఆఫీసులపై మనీలాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ(ED) ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం విదితమే.