Share News

ED Raids: హీరా గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

ABN , Publish Date - Aug 04 , 2024 | 05:37 AM

తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో చెల్లింపుల పేరుతో లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసగించిన హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ED Raids: హీరా గ్రూప్‌ సంస్థల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తక్కువ పెట్టుబడికి ఎక్కువ మొత్తంలో చెల్లింపుల పేరుతో లక్షలాది మంది నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించి మోసగించిన హీరా సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని హీరా గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు జరిపాయి.


బంజారాహిల్స్‌లోని నౌహీరా షేక్‌ ఇల్లు, కార్యాలయంతోపాటు సంస్థ డైరెక్టర్లు, ఇతరుల ఇళ్లల్లో శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. తనిఖీల్లో రూ.90 లక్షల నగదు, కోట్ల విలువ చేసే స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర డిజిటల్‌ ఆధారాల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా, నౌహీరా షేక్‌పై దేశవ్యాప్తంగా 60కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈడీ సుమారు రూ.400 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది.

Updated Date - Aug 04 , 2024 | 05:37 AM