Home » Etela rajender
సిద్దిపేట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏనాడు తాను చేస్తున్నానని చెప్పలేదని, జీతగాన్ని, సేవకుణ్ణి తప్ప ఓనరును కాదంటారని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ మాట్లాడినా, ఆయన మంత్రులు మాట్లాడినా మేమే ఇస్తున్నామంటారని విమర్శించారు.
బీజేపీ సీనియర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ల మధ్య వివాదం ముదురుతోంది. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు.
తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఇటు మంత్రి కేటీఆర్ ఒకరిపై మరొకరు ఎక్కడలేని ప్రేమ కురిపించుకుంటున్నారు. ఈటల ఇలా తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. అలా మంత్రి కేటీఆర్ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. జమున చెప్పేవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఈటల రాజేందర్ హత్యకు కౌశిక్‌రెడ్డి కుట్ర పన్నారని జమున ఆరోపించారు. ఇదే అంశంపై కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు
పార్టీ మార్పు ప్రచారంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) స్పందించారు. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారలేమని, అన్ని పార్టీల్లో అభిప్రాయభేదాలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఎవరిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేయలేదని, హైకమాండ్ పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లానని వివరించారు.
ఈటల రాజేందర్ సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల జమున మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.. ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు.
ఈటల.. ఈటల.. (Etela) తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) ఇప్పుడీ పేరు మార్మోగుతోంది.. గత కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో నెలకొన్న పరిస్థితులతో ఈటల రాజేందర్ (Etela Rajender) ఏం చేయబోతున్నారు..? కీలక నిర్ణయమే తీసుకుంటారా..? గత కొన్నిరోజులుగా ఆయన అసంతృప్తితో రగిలిపోతుండటానికి కారణాలేంటి..? బీజేపీలో కంటిన్యూ అవుతారా.. లేకుంటే కాంగ్రెస్ గూటికి చేరుతారా..? ..
అవును.. ఢిల్లీకి (Delhi) రావాలని తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్ (Etela Rajender) , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Komati Reddy Rajagopal Reddy) పిలుపొచ్చింది..! రెండ్రోజులకోసారి పార్టీ మారుతున్నారని, బీజేపీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలని అగ్రనేతలు ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం..
బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునిగిపోయే నావ కాంగ్రెస్‌లోకి బీజేపీ నేతలు ఎవరూ వెళ్ళరన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మౌనం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయానికి కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.