Bandi Sanjay : ఈటల, రాజగోపాలరెడ్డి పార్టీ మార్పు వార్తలపై బండి సంజయ్ కీలక కామెంట్స్

ABN , First Publish Date - 2023-06-23T13:46:26+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునిగిపోయే నావ కాంగ్రెస్‌లోకి బీజేపీ నేతలు ఎవరూ వెళ్ళరన్నారు.

Bandi Sanjay : ఈటల, రాజగోపాలరెడ్డి పార్టీ మార్పు వార్తలపై బండి సంజయ్ కీలక కామెంట్స్

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునిగిపోయే నావ కాంగ్రెస్‌లోకి బీజేపీ నేతలు ఎవరూ వెళ్ళరన్నారు. పార్టీ మార్పుపై ఎవరి ఆలోచనలు వారివన్నారు. డిపాజిట్లు రాని.. అభ్యర్థులు లేని కాంగ్రెస్ లోకి ఎవరూ వెళ్లరన్నారు. ఎన్నికలు వస్తున్నందుకే కేసీఆర్‌కు అమరవీరులు గుర్తొచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

బీజేపీలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారతారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరి అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న విషయం ఆసక్తిని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో వీరిద్దరూ తమ పార్టీలోకి వస్తారంటూ కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తుండగా.. నేతలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. తనకు కీలక పదవి ఇస్తామన్న హామీని అమలుచేయకపోవడంతో పార్టీ నాయకత్వం వైఖరిపై ఈటల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటలకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, అందుకు అనుగుణంగా ప్రకటన వెలువడకపోవడంతో ఈటల అసహనానికి గురవుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-06-23T14:18:50+05:30 IST