Home » Etela rajender
రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మంది(82ు)పై కేసులున్నాయని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ)’ తెలిపింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులున్నాయని వెల్లడించింది.
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు మృతిపై సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంతాపం వ్యక్తం చేశారు.
దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది.
బీఆర్ఎస్ కథ ముగిసిందని, కాంగ్రె్‌సపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయంగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరికి బెర్త్ లభించనుంది? మోదీ తన క్యాబినెట్లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన దృష్ట్యా, కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి తెలంగాణ కోటాపై ఎలాంటి ప్రభావం పడనుంది? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదేళ్లు అధికారంలో ఉండి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పాతాళానికి పడిపోయింది. ఆరు నెలల వ్యవధిలో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా తగ్గిపోంది. మరోవైపు బీజేపీ గ్రాఫ్ అనూహ్యంగా పైకి ఎగబాకింది.
‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. డబ్బు పంపిణీ చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదు. 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించినప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనేదానికి సంకేతం.
దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి(Malkajigiri). ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది.
ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘనందనరావులు లోక్‌సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారు. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. ఎంపీగా బండి సంజయ్ గెలిచారు. హుజురాబాద్, గజ్వేల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈటల ఓడారు. ఇప్పుడు ఈటల మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి.. మెదక్ ఎంపీగా రఘనందనరావు గెలిచారు.
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.