Home » Etela rajender
వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో దిగారు. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్‌గా చేసుకుని.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితిలోనే కాంగ్రె్‌సను గెలిపించారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నా రు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అలవి కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గురువారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.......
మల్కాజిగిరి నియోజకవర్గంలో వీరశైవలింగాయత్‌లు తమ మద్దతును బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(BJP candidate Etala Rajender)కు ప్రకటించారు. ఈ మేరకు వీరశైవలింగాయత్ సమాజం అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర ప్రసాద్ మల్కాజిగిరిలోని తన నివాసంలో వీరశైవలింగాయత్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఒకవైపు ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట వసూళ్లు జరుగుతుండగా.. హైదరాబాద్‌లో మరో ఆర్(రజాకార్) ట్యాక్స్ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్చ బాగా జరుగుతోంది. ఒక ఆర్.. తెలంగాణాకు సంబంధించినది కాగా, మరో ఆర్.. ఢిల్లీది.
దేశంలో మరోసారి నరేంద్రమోదీ(Narendra Modi)యే ప్రధాని అవుతారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జేజేనగర్‌లోని మహాభోది ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తమిళుల ఆత్మీయ సమావేశంలో అయన మాట్లాడారు.