Share News

Etela Rajender: అతికొద్ది కాలంలో ప్రజలతో ఛీ కొట్టించుకుంది కాంగ్రెస్ సర్కార్

ABN , Publish Date - May 20 , 2024 | 04:44 PM

Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Etela Rajender: అతికొద్ది కాలంలో ప్రజలతో ఛీ కొట్టించుకుంది కాంగ్రెస్ సర్కార్
BJP Leader Etela Rajender

ఖమ్మం, మే 20: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ (BJP Leader Etela Rajender) తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల ఉద్యోగులు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి


సోనియా గాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీలు (Rahul Gandhi) నిరుద్యోగ యువతకు 4 వేలు ఇస్తా అని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. ఉద్యోగులకు ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈహెచ్ఎస్ కింద ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. మంత్రులు స్కూల్, కాలేజీ యాజమాన్యాలతో సమావేశాలు పెట్టి ఓట్లు వేయాలని బలవంతం చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అండగా ఉన్నవారికి జీతాలు ఇవ్వకుండా ఉండటం సమంజసం కాదన్నారు.

Chennai: అయ్యో పాపం.. అతిగా స్పందించిన నెటిజన్లు.. మహిళ ఆత్మహత్య..


జీవో నెంబర్ 317 విషయంలో కేసీఆర్‌ను (BRS Chief KCR) తప్పు పట్టామని.. నేడు ఉద్యోగుల మీద లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వం అతికొద్ది కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. ప్రతి నెలా ప్రతి మహిళకు 8 వేల భృతి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. ా నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యపై అయిన కొట్లాడే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. అందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటెల రాజేందర్ కోరారు.


ఇవి కూడా చదవండి...

SIT Report to DGP: అలర్లపై ఈసీకి సిట్ నివేదిక.. ఏం తేల్చిందంటే?

AP Election 2024: సస్పెండ్ అయిన అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 04:46 PM