Share News

BJP: టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

ABN , Publish Date - May 23 , 2024 | 10:08 AM

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్‌గా చేసుకుని.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.

BJP: టార్గెట్ ఎమ్మెల్సీ..  ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (BJP) గ్రాడ్యుయేట్స్ (Graduates) ఎమ్మెల్సీ ఉప ఎన్నికను (MLC by-election) టార్గెట్‌ (Target)గా చేసుకుని.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని కిషన్ రెడ్డి (Kishan Reddy), ఈటల రాజేందర్(Etela Rajendar) భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ (Warangal), నల్గొండ (Nalgonda), ఖమ్మం (Khammam) జిల్లాల్లో విస్త్రతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ నేతలు (BJP Leaders) పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.


నేడు ఖమ్మంకు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, దేవరకొండ, సాగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో ఈటల రాజేందర్ ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు. కాగా ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నికకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.


రైతుల వద్దకు బీజేపీ

మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ నాయకులు ఐకేపీ సెంటర్లకు వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బీబీనగర్ మండలం, రాఘవాపురం, రుద్రవెల్లిలో కిషన్ రెడ్డి పర్యటించి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు. కల్లాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సన్నాలతో పాటు... దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 10:12 AM