Home » Father
ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది! కానీ.. ప్రణీత్ హన్మంతు అనే ప్రముఖ యూట్యూబర్, అతడితోపాటు మరో ముగ్గురు కలిసి.. ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా..
ఆ ఇద్దరు వైద్యులు తండ్రీకొడుకులు! చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో అనేది సంబంధీకులకు చెప్పేస్తారు. పైగా.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు.
నిలువ నీడగా ఉన్న ఇల్లే నిండు కుటుంబాన్ని బలిగొంది. మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలు నిద్రిస్తున్న ఐదుగురిపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
మంచి చదువు చెప్పిస్తూ.. చక్కని భవిష్యత్తు కోసం ఆకాంక్షించే కన్నతండ్రి మనసులో తన పట్ల ‘దారుణమైన ఆలోచన’ ఉందని ఏ కూతురు ఊహిస్తుంది? ఆప్యాయంగా ఎత్తుకోవాల్సిన చేతులే రాకాసి హస్తాలై తన ప్రాణాన్ని బలిగొంటాయని ఏ కూతురు అనుకుంటుంది? పాపం పదమూడేళ్ల ఆ చిట్టితల్లి... ‘వంట కోసం కట్టెలు తెద్దాం..
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణ కేం ద్రం(టీజీపీఏ)ను ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు సందర్శించారు. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా ప్రొబేషనరీ ఐఏఎ్‌సలు శనివారం అకాడమీకి వచ్చారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, ఇతర అధికారులు వారికి స్వాగతం పలికారు.
తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా మార్చురీలోనే మగ్గుతోంది.
ట్రాక్టర్ రోటవేటర్‌తో తండ్రి దుక్కి దున్నుతుండగా.. సరదాగా ట్రాక్టర్ ఇంజన్ పైకి ఎక్కిన కుమారుడు ప్రమాదవశాత్తు రోటవేటర్లో పడి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లైన్‌తండాలో సోమవారం జరిగింది. లైన్‌తండాకు చెందిన గుగులోతు మశోద, రాజులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విధి విక్రించడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. అయినా ఆ దంపతులు ఆ బిడ్డ జ్ఞాపకాలను మరువలేకపోయారు. అందుకే తమ బిడ్డకు ఓణీల కార్యక్రమం కూడా నిర్వహించి, ఆమె స్మృతిలో మైమరిచి పోయారు.
తరచూ ఫోన్ మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతురి పైనే ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని దారుణంగా హతమార్చాడో కుమారుడు. బాధ్యత మరచి, అల్లరిచిల్లరగా తిరుగుతున్న కుమారుడిని మందలించడంతో పాటు అతడు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో డెబ్భై యేళ్ల తండ్రిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తూ, కాళ్లతో తన్నుతూ రాక్షసంగా వ్యవహరించాడా ప్రబుద్ధుడు.