Home » Flood Victims
వరద సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్‌నగర్ వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న(ఆదివారం) అర్ధరాత్రి సమయంలో విజయవాడ సమీపం బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి మెుత్తం పర్యటిస్తూ వరదల్లో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది ప్రజలకు దగ్గరుండి మరీ ఆహారాన్ని పంపిణీ చేసే పనులను నిరంతరం పరిశీలించారు.
ఏపీలోని విజయవాడ నగరంపై బుడమేరు దండెత్తింది. కనీవినీ ఎరుగని స్థాయిలో ముంచెత్తి బీభత్సం సృష్టించింది.
భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ చోట ఈ చోట అని లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి.
గుజరాత్‌ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని(Gujarat Floods) అనేక ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..
వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.