Home » Flood Victims
Telangana: భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి వర్ణణాతీతం. వరదలకు ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పంటల పొలాలు నీటమునిగి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
విజయవాడలో వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.
చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు... ఇంకా ఎందరెందరో సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి జీవులు! బుడమేరు వరద వీరి బతుకులను ముంచేసింది!
ఏ.శివకుమార్‌రెడ్డి రూ.1.50 కోట్లు, ఇ.చంద్రారెడ్డి రూ.50 లక్షలు, గుడివాడ విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ రూ.30 లక్షలు, బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు, వెలగపూడి శంకర్రావు రూ.25 లక్షలు, మదన్మోహన్రావు రూ.25 లక్షలు, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు...
వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకంగా విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభు త్వ ఉద్యోగులు, వివిధ పరిశ్రమలు, దాతలు, రాజకీయ నేత లు, ప్రజలు స్పందిస్తున్నారు.
‘అన్నా... నా బండి రిపేర్ చేయ్యాలి. అర్జెంటు అన్నా. ఇది లేకపోతే ఉద్యోగమే లేదు.’ ‘ఇప్పుడు కాదన్నా. కనీసం 10 రోజులు పడుతుంది. చాలా బళ్లు ఉన్నాయి.’ ఇది ఇప్పుడు బెజవాడ నగరంలో మెకానిక్‌లకు, బైక్ యజమానులకు మధ్య జరుగుతున్న సంభాషణ.
వరద ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 33కు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోనే 25 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
విధులు నిర్వర్తిస్తూ వరదలో కొట్టుకుపోయి మరణించిన లైన్మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.25 లక్షలు అందజేశారు.
ముంపులో మునిగి, బురద పేరుకుపోయి కష్టాల కడలిలా మారిన వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సర్కారు ముమ్మర చర్యలు తీసుకుంటోంది. సహాయ చర్యల్లో వేగం పుంజుకొంది.