Rain Effect: వరద బీభత్సానికి దెబ్బతిన్న వేలాది కార్లు.. గగ్గోలు పెడుతున్న వాహనదారులు..
ABN , Publish Date - Sep 06 , 2024 | 09:14 AM
విజయవాడలో వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.
విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా విజయవాడ నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. కృష్ణానది, బుడమేరు ఉగ్రరూపం దాల్చి విజయవాడ అల్లకల్లోలం అయ్యింది. ఇళ్ల మెుదటి అంతస్తు వరకూ నీరు చేరి గత వారం రోజులపాటు ప్రజలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి కొంతమేర నష్టాన్ని తగ్గించగలిరారు. అయితే వరదలకు ప్రాణనష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా ఇంటి సామగ్రి, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. వీటితోపాటు వేల సంఖ్యలో కార్లు నీట ముగిని దెబ్బతిన్నాయి. దీంతో వాటి రిపేర్లకు యజమానులు నానావస్థలు పడుతున్నారు.
బుడమేరు పొంగి వరదలు భారీగా రావడంతో వాహనాలు దాదాపు వారం రోజులపాటు నీటిలోనే ఉండిపోయాయి. మరికొన్ని వాహనాలు అయితే వరద ధాటికి ఇంటి నుంచి దూరంగా కొట్టికుపోయాయి. ఇంకొన్ని కార్లు తల్లకిందులుగా పడిపోయి అలానే నీటిలో ఉండిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తుండడంతో కార్ల యజమానులు వాటిని స్టార్ చేసేందుకు ప్రయత్నించగా.. అవి మోరాయిస్తున్నాయి. అయితే స్టార్ కాకపోవడంతో వాటిని రిపేర్ చేయించేందుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కారు మరమ్మతుకు కనిష్ఠంగా రూ.70వేలు గరిష్ఠంగా రూ.లక్ష వరకూ ఖర్చవుతుందని షోరూమ్ యజమానులు చెప్పడంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గి కుదుటపడ్డామని అనుకుంటున్న సమయంలో మరో దెబ్బ తగిలిందని వరద బాధితులు వాపోతున్నారు.
విజయవాడ వరద ప్రభావ ప్రాంతాల్లో వరదనీరు తగ్గి వాహనాలు బయటపడుతున్నాయి. ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలు దర్శనమిస్తున్నాయి. వరద ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో వాహనదారులు వాటిని తీసుకుని షోరూమ్‌లకు వెళ్తున్నారు. అతి కష్టం మీద కార్లను ట్రక్‌లపై గొలుసులతో కట్టి మరీ తరలిస్తున్నారు. అయితే అక్కడ వారు చెప్పే మాటలు విని యజమానులు నోరెళ్లబెడుతున్నారు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చవుతుందని, రూ.12లక్షల నుంచి రూ.కోటి వరకూ విలువ చేసే కార్లకు కనీసం రీసేల్ ధర కూడా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారంతా ఆందోళన గురవుతున్నారు.
అయితే పోరూమ్‌లకు వెళ్లిన కార్ల యజమానులకు పోరూమ్ మేనేజర్లు కొన్ని సలహాలు ఇస్తున్నారు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని, వీటిని రిపేర్ చేసినా లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తలెత్తె ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు సైతం తమ వంతు కర్తవ్యంగా ఆర్థిక భారం పడకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు. అయితే రిపేర్ చేసేందుకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో వాటిని అమ్మేయడమే మేలని కొంతమంది వాహనదారులు ఆలోచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nimmala Ramanayudu: బుడమేరుకు పడిన గండ్ల పూడిక పనుల్లో కీలక ఘట్టం
AP News: నేటి నుంచి వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి