Home » Flood Victims
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వ
కృష్ణానది, బుడమేరు వరద ఎన్టీఆర్ జిల్లా పరిధిలో అపార నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1,000 కోట్ల వరకూ ఉంటుంది.
వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తారన్నారు.
బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి ఆర్మీ బృందం వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
బుడమేరు ముంపుతో తలెత్తిన భారీ వరదలకు ప్రధాన కారణం ఏంటనే విషయంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకుని విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామంలో ఆకస్మికంగా ఆయన పర్యటించారు.
గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని అకాల వర్షాలు సృష్టించిన జల ప్రలయానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ బుదర నీటిలో తిండి తిప్పలు లేకుండా గడుపుతున్నారు.
Andhrapradesh: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు.
Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.
తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.