Share News

AP Government: ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల..

ABN , Publish Date - Jul 08 , 2024 | 02:24 PM

Andhrapradesh: ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది.

AP Government: ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల..
Free Sand Policy

అమరావతి, జూలై 8: ఏపీలో (Andhrapradesh) ఉచిత ఇసుక పాలసీపై (Free Sand Policy) జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం (AP Government) సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.

MLA Raghu Rama: ఆర్ఆర్ఆర్‌ను చూసి ‘జై జగన్’ అంటూ నినాదాలు.. ఈ రియాక్షన్ ఊహించి ఉండరేమో..!


ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే...

వైసీపీ ప్రభుత్వంలోని 2019, 2021 ఇసుక విధానాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సర్కార్ సూచనలు చేసింది.


49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


కాగా.. నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి వస్తుండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురు చూపులు చూశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యం అని కింద స్థాయి అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Telangana: తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పంపకం..

Viral Video: ఈ వ్యక్తిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు.. బైక్‌తో సహా వరదలో చిక్కుకున్నా అతడేం చేస్తున్నాడో చూడండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 03:39 PM