AP News: గుణదల సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో పోడియం తొలగింపు పనులు షురూ...
ABN , Publish Date - Sep 16 , 2024 | 04:11 PM
Andhrapradesh: ‘‘నా చిన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్లాలన్నా భయపడే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’ అని రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి నేరుగా తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రభుత్వ అధికారులు..
విజయవాడ, సెప్టెంబర్ 16: గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియం తొలగించే కార్యక్రమాన్ని సోమవారం అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా, కమీషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఎంవి శేషగిరి బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (MLA Gadde Rammohan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. ‘‘నా చిన్నప్పుడు చాలా మంది బ్యాంకులకు వెళ్లాలన్నా భయపడే వారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి నేరుగా తమ అభిప్రాయాలు చెబుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు కూడా ప్రభుత్వ అధికారులు.. ప్రజా సేవకు ముందుండాలని ఆదేశించారన్నారు.
Bandi Sanjay: విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్ జంకుతుంది
వివిధ పనులపై వచ్చే ప్రజలను మర్యాదగా చూస్తూ.. వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కోర్టుల తరహాలో బెంచ్‌లు ఉండటం బ్రిటీష్ పాలన నాటి నుంచి ఉందన్నారు. ఆధునిక కాలంలో కాలం చెల్లిన ఇటువంటి వాటిని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు కోర్టులకు వస్తున్నామనే భావనలో ఉంటున్నారని.. ఇటువంటి వాటికి స్వస్తి చెప్పాలనే ప్రభుత్వం ఈ బెంచ్‌లను తొలగించాలని సర్క్యూలర్ ఇచ్చిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సరళతరమైన సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది గొప్ప సంస్కరణగా తాను భావిస్తున్నానని.. ప్రజలకు ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ సేవకులే అని ఆర్పీ సిసోడియా చెప్పుకొచ్చారు.
TG Politics: తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..
ఈ నిర్ణయం మంచిదే: గద్దె రామ్మోహన్
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న బెంచ్‌ల తొలగింపు నిర్ణయం మంచిదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అంటే.. ప్రజలకు సేవ చేసే కార్యాలయాలు అనే భావన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తరహాలో ఆలోచన చేసి చర్యలు చేపట్టారని తెలిపారు. న్యాయమూర్తి ఎదుట ప్రతిఒక్కరూ చేతులు కట్టుకుని నిలబడి న్యాయస్థానానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఆ తరహాలో రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉండటం సరికాదని ప్రభుత్వం భావించిందన్నారు. గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఇటువంటి సంస్కరణలు ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Narayana: రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు
Prakasam Barrages: పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం...
Read LatestAP NewsANDTelugu News