Home » Gannavaram
Andhrapradesh: గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చెక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చెన్నై, బెంగళూరు ఇండిగో విమానాలు గాలిలో చక్కెర్లు కొట్టాయి.
Andhrapradesh: వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. బ్రదర్ అనిల్ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎస్కార్ట్ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి కేసరపల్లిలో విల్లాకి బ్రదర్ అనిల్ బయలుదేరి వెళ్లనున్నారు.
Andhrapradesh: గన్నవరంలో అంగన్వాడీల నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు తెలిపింది. సీడీపీవో కార్యాలయం ఎదుట సమ్మెలో పార్టీ ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి చంద్రబాబు వచ్చారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో టీడీపీ శ్రేణుల కోలాహలం కనిపించింది. గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్ టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఈ రిపోర్ట్ వెలుపలే టీడీపీ శ్రేణులను పోలీసులు నిలిపివేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు(Students) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన అంకిత్(15), శశివర్దన్(14) ఫొటో షూట్ నిమిత్తం గన్నవరం మండలం సావరగూడెనికి వచ్చారు.
విజయవాడ: గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో వంశీ గెలుపు కోసం సర్నాల బాలాజీ పని చేశారు. అయితే వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాలాజీ తటస్థంగా ఉండిపోయారు.
మందేస్తూ.. చిందేయ్ రా...చిందేస్తూ మందెయ్ రా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! సామాన్యుడి పుట్టిన రోజుకే ఇప్పుడు చాలా వరకు హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్, పార్టీలు, మందు, విందు అనేది కామన్. ఇక అదే ప్రజాప్రతినిధి పుట్టిన రోజు అయితే.. ఆ వేడుకలు, పార్టీలు గురించి మాటల్లో చెప్పలేం..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) పుట్టిన రోజు (Birth Day) కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు నానా హంగామా చేశారు. జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు...