YS Jagan: వైఎస్ జగన్ లండన్ వెళ్తుండగా.. గన్నవరం ఎయిర్‌పోర్టులో అసలేం జరిగింది..?
ABN , Publish Date - May 18 , 2024 | 04:24 PM
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది...
అమరావతి, ఆంధ్రజ్యోతి మే-18: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి లండన్ వెళ్తుండగా ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించడం.. ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది..? ఆ వ్యక్తి ఎందుకొచ్చారు..? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు వచ్చాయి. పైగా పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. అయితే.. ఆ వ్యక్తిని ఎన్నారై డాక్టర్ తుళ్లూరు లోకేష్‌గా పోలీసులు గుర్తించారు. అసలేం జరిగింది..? ఎయిర్‌పోర్టుకు ఎందుకొచ్చారనే విషయాలు క్లియర్ కట్‌గా మీడియాకు వెల్లడించారు.
లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!
ఇదీ అసలు కథ..!
‘నేను నా స్నహితులను కలుసుకునేందుకు ఎయిర్ పోర్ట్‌కు వచ్చాను. నా పాటికి నేను కూర్చుని ఉంటే పోలీసులు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చారు. జగన్‌పై నేను పెట్టిన పోస్ట్‌ల గురించి ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు..? అని నన్ను నిలదీశారు. టిక్కెట్ పని మీద వచ్చానని.. ఇక్కడ ఉంటే తప్పేంటి..? ని అడిగాను. దీంతో పోలీసులు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. గన్నవరం పోలీస్టేషన్‌కు తరలించి ఇబ్బందులు పెట్టారు. నా ఫోన్స్ కూడా బలవంతంగా లాక్కున్నారు.. తర్వాత నన్నుకొట్టారు. ఆ తరువాత నన్ను ఆస్పత్రికి తరలించారు’ అని లోకేష్ మీడియాకు వెల్లడించారు.
నిజమే చెబుతున్నా..!
‘జగన్ హవాలా ద్వారా వేల కోట్లు దోచాడు. నా పోస్టులు, నా పని తీరుపై అనేక విధాలుగా పోలీసులు ప్రశ్నించారు. 20 మంది పోలీసులు నాపై దాడి చేశారు. గన్నవరం సీఐ చాలా అత్యుత్సాహంతో వ్యవహరించారు. జగన్ అరాచకాలు, అవినీతిపై పోస్ట్‌లు పెట్టడం తప్పా..?. జగన్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా కఠినంగా వ్యవహరించారు. మా న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వచ్చే వరకు నా ఫోన్లు కూడా ఇవ్వలేదు. 151 సీఆర్పీసీ కింద నా మీద చర్యలు తీసుకున్నట్లు చూపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ మా గొంతు నొక్కలేరు. జగన్ అవినీతిపై.. హవాలా చేసిన తీరుపై పూర్తి స్తాయి విచారణ చేయాలి. సీబీఐ, ఈడీ సంస్థలు వెంటనే స్పందించాలి. నన్ను ఎవరూ ఇంతవరకూ ఇలా ఇబ్బంది పెట్టలేదు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలి’ అని లోకేష్ డిమాండ్ చేశారు.
ఎవర్నీ వదలను!
‘ఇప్పటికే పీఎం ఆఫీస్, హైకోర్టుకు సమాచారం ఇచ్చాను. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి. డీజీపీ, ఛీఫ్ సెక్రటరీని కూడా ఇందులో బాధ్యులను చేస్తాం. ప్రైవేటు కేసు వేసి అందరినీ కోర్టులో నిలబెడతాను. నా తప్పు ఉంటే అసలు ఎయిర్ పోర్ట్ అథారిటీ స్పందించాలి. జిల్లా ఎస్పీ, పోలీసులకు ఏం సంబంధం..?. సోమవారం ఈ ఘటనపై కోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం. చట్ట విరుద్ధంగా పనిచేసిన పోలీసులు, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసే వరకు నా పోరాటం సాగుతుంది’ అని లోకేష్ క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేశారు. మొత్తానికి చూస్తే.. ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం అస్సలు కనిపించట్లేదు. కోర్టుల దాకా వెళ్తే అసలేం జరుగుతుందో.. న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.