Home » Ganta Srinivasa Rao
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ తరలించడం నిరసిస్తూ గత వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సరైన సమయంలో పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ... చంద్రబాబు అక్రమ అరెస్టు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఉన్న జైల్లో కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారని.. అక్కడ బాబుకి సేఫ్టీ కాదన్నారు.
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scheme) లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu)ను ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. అదే సమయంలో టీడీపీకి సంబంధించిన కీలక నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)ని కూడా ఈరోజు ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి.. రాత్రి 9 గంటల సమయానికి పీఎం పాలెం పోలీసు స్టేషన్ నుంచి బెయిల్పై విడుదల చేశారు.
మాజీ మంత్రి, త్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను దిశా ఏసీపీ వివేకానంద అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ: ఉత్తర నియోజక వర్గంలో దొంగ ఓట్లు నమోదుపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బోగస్ ఓట్ల చేర్పులు ఒక్క ఉత్తర నియోజకవర్గంలోనే కాదని.. 175 అసెంబ్లీ స్ధానాల్లో ఉన్నాయన్నారు.
గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలువుతోందని, ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు.