Ganta Srinivasa Rao: ఏపీ నుంచి 'లులూ' ను జగన్రెడ్డి తరిమేశారు
ABN , First Publish Date - 2023-09-27T19:21:08+05:30 IST
వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు.‘‘విశాఖలో 'లులూ’ను తరిమేశారు. మీకొక వందనం... ఇక్కడ ఉండలేం...అని చెప్పి వెళ్లిపోయినా 'లులూ'కు హైదరాబాద్లో ఘన స్వాగతం పలికారు. జగన్రెడ్డి "స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం"తో విసిగిపోయిన 'లులూ' అసలు ఏపీ(AP)లో పెట్టుబడులే పెట్టమని చెప్పేసింది. మీ రివర్స్ పాలనతో విశాఖలో 5 వేల మంది యువతకి ఉపాధిని దూరం చేశారు’’ అని గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.