Gantasrinivasrao: బాబు విషయంలో విజయసాయి, సజ్జల, బొత్స వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి?
ABN , First Publish Date - 2023-09-12T14:04:31+05:30 IST
వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
విశాఖపట్నం: వైసీపీ నేతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (TDP Leader Ganta Srinivas rao) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు అరెస్టులో (Chandrababu Arrest) కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. చంద్రబాబుకు 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి (Vijayasaireddy) అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. 2024లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కనిపించరని చెప్పడం వెనుక విజయసాయిరెడ్డి ఉద్దేశం ఏమిటని నిలదీశారు. మరోవైపు చంద్రబాబు, లోకేశ్‌లను పాతాళానికి తొక్కేస్తామని.. తాము తలుచుకుంటే బతికి బట్టకట్టగలరా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) బెదిరించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలని మండిపడ్డారు. కొత్త అమావాస్య నాటికి టీడీపీ, జనసేన కనుమరుగై పోతాయని, లేకపోతే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ ("Botsa Satyanarayana)నెలరోజుల కిందట ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద వైసీపీ చాలా రోజులుగా కుట్ర చేస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీ పైనా వైసీపీ చేస్తున్న కుట్రలు నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే వైసీపీ కుట్ర కోణం, ఆ పార్టీ నిజస్వరూపం బయటపడుతుందని గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.