TDP: సీఎం జగన్పై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-13T14:45:26+05:30 IST
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఉన్న జైల్లో కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారని.. అక్కడ బాబుకి సేఫ్టీ కాదన్నారు.
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు (TDP Leader Ganta Srinivas rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఉన్న జైల్లో కరుడు కట్టిన నేరస్తులు ఉన్నారని.. అక్కడ బాబుకి సేఫ్టీ కాదన్నారు. బాబుకు ఏమైనా జరిగితే... ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. మొద్దు శ్రీనును జైల్లోనే చంపేశారన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. చంద్రబాబును ఒక్క రోజు అయినా జైలు పెట్టాలన్న దుర్బుద్ది జగన్కు ఉందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ, ఇండియా కూటమి, జాతీయ నేతలు ఖండిస్తున్నారన్నారు. బాబు అరెస్టును సినిమా రంగానికి చెందిన వారు కూడా చాలా మంది ఖండిస్తున్నారని తెలిపారు. అయితే కొంతమంది బాబు అరెస్టును ఖండించడానికి భయపడుతున్నారన్నారు. తమ మీద కూడా కేసులు పెట్టి వేధిస్తారేమో అని అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు చేసినప్పటి నుంచి టీడీపీ నేతలను వేధిస్తున్నారన్నారు. నిరసన చేస్తున్న టీడీపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేసి భయోత్పతాన్ని సృష్టిస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.