Home » Hardik Pandya
66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను మిడిలార్డర్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. నిప్పులు కక్కే బంతులతో చెలరేగుతున్న పాక్ బౌలర్లపై ఆరంభం నుంచి ఎదురు దాడి చేసిన వీరిద్దరు టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు.
కరీబియన్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది.
ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతులైన పేస్ ఆల్‌రౌండర్ల హార్దిక్ పాండ్యా ఒకడు. అయితే కొన్నేళ్లుగా అతడి కెరీర్ గాయాలతో సతమతం అయ్యింది. ఈ పరిణామం అతడి టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యాన్ని పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో పాండ్యాకు భవిష్యత్‌లో అసలు టెస్ట్ క్రికెట్ ఆడే ఉద్దేశం కనిపించడం లేదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఫిట్నెస్ ఉన్నా అతడు ఎందుకు టెస్ట్ క్రికెట్ ఆడటం లేదో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓడి విమర్శలను ఎదుర్కొంటున్న టీమిండియా యువ జట్టుకు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విమర్శకులకు అశ్విన్ సమాధానమిచ్చాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.
వెస్టిండీస్‌పై గడ్డపై టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. తొలి 3 టీ20ల్లో వరుసగా 39, 51, 49 పరుగులతో రాణించిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 46వ స్థానానికి చేరుకున్నాడు.
సరిగ్గా మరో 2 నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టోర్నీలో పాల్గొనే జట్లు 15 మందితో కూడిన తమ తొలి స్క్వాడ్ వివరాలను ఐసీసీకి సెప్టెంబర్ 5 లోపు అందివ్వాలి. తుది స్వ్కాడ్ వివరాలు సెప్టెంబర్ 27లోపు తెలపాల్సి ఉంటుంది. ఈ లోపు ముందుగా ప్రకటించిన స్క్వాడ్‌లో ఎన్ని మార్పులైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.
కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.