Kapil Dev: పాండ్యాపై సంచలన ఆరోపణలు.. ఆ ఫార్మాట్‌లో అతడు ఎందుకు ఆడడు?
ABN , First Publish Date - 2023-08-16T13:02:43+05:30 IST
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన పేస్ ఆల్‌రౌండర్ల హార్దిక్ పాండ్యా ఒకడు. అయితే కొన్నేళ్లుగా అతడి కెరీర్ గాయాలతో సతమతం అయ్యింది. ఈ పరిణామం అతడి టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యాన్ని పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో పాండ్యాకు భవిష్యత్‌లో అసలు టెస్ట్ క్రికెట్ ఆడే ఉద్దేశం కనిపించడం లేదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ఫిట్‌నెస్ ఉన్నా అతడు ఎందుకు టెస్ట్ క్రికెట్ ఆడటం లేదో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు. పాండ్యాకు భవిష్యత్‌లో అసలు టెస్ట్ క్రికెట్ ఆడే ఉద్దేశం కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఫిట్‌నెస్ ఉన్నా అతడు ఎందుకు టెస్ట్ క్రికెట్ ఆడటం లేదో అర్ధం కావడం లేదని కపిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ కొరత కనిపిస్తోందని.. కానీ పాండ్యా ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా లేడని తనకు అనిపిస్తోందని కపిల్ అన్నాడు.
తాజాగా ఓ జాతీయ ఛానల్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడు హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడాడు. మన దేశంలో ఫిట్‌గా కనిపించే ఆటగాళ్లలో పాండ్యా ఒకడు అని.. అతడికి ఎలాంటి ఫార్మాట్ ఆడేందుకు తగిన సామర్థ్యం ఉందని కపిల్ తెలిపాడు. కానీ ఎందుకో పాండ్యా రెడ్‌బాల్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నాడు. పాండ్యా మరింత రాటుదేలాలంటే టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలని సూచించాడు. చివరిగా పాండ్యా 2018లో ఇంగ్లండ్‌పై చివరి టెస్ట్ ఆడాడు. గత ఐదేళ్లలో ఒక్క టెస్టు కూడా పాండ్యా ఆడలేదు.
ఇది కూడా చదవండి: Gymnast Deepa Karmakar: సాయ్ మౌనం.. బాధాకరం
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన పేస్ ఆల్‌రౌండర్ల హార్దిక్ పాండ్యా ఒకడు. అయితే అతడి కెరీర్ గాయాలతో సతమతం అయ్యింది. ఈ పరిణామం అతడి టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యాన్ని పరిమితం చేసింది. అయితే టెస్టు క్రికెట్ ఆడేందుకు తాను ఇంకా కట్టుబడి ఉన్నానని, పూర్తి ఫిట్‌నెస్ తిరిగి పొందడానికి తాను తీవ్రంగా శ్రమిస్తున్నానని ఇటీవల పాండ్యా చెప్పాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆడుతున్న అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణించలేకపోతున్నాడు. వన్డే ప్రపంచకప్ టీమిండియా గెలవాలంటే పాండ్యా రాణించడం కీలకం. అంతేకాకుండా అతడి ఫామ్ కూడా జట్టుకు చాలా ముఖ్యం. పాండ్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణించి త్వరలో భారత టెస్టు జట్టులో పునరాగమనం చేస్తాడో లేదో వేచిచూడాలి.