Home » Hemant Soren
భూకుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనను ఒక రోజు కస్టడీకి అప్పగిస్తూ పీఎంఎల్‌ఏ కోర్టు నిర్ణయం తీసుకుంది.
జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హేమంత్ సోరెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. శుక్రవారం నాడు విచారిస్తామని హేమంత్ సోరెన్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలకు సమాచారం ఇచ్చింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ ఎంపికయ్యారు. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సేపు విచారణను ఎదుర్కొన్న హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోనికి తీసుకుంది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను బుధవారంనాడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న క్రమంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే జరిగితే ప్రత్యామ్నాయంగా ఆయన భార్య కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా కల్పనను సీఎం చేయడానికి తాము వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ తెరపైకి వచ్చారు.
ఝార్ఖాండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారంనాడు ఒకవైపు విచారణ చేస్తుండగా, మరోవైపు ఈడీ ఆధికారులపై సీఎం పోలీసు కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాంచీలోని ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించి మనీల్యాండరింగ్ కోణంలో సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ని ముఖ్యమంత్రి చేసే యోచనలో ఉన్నారని, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ, జార్ఖండ్ నేత నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేయవచ్చనే భయంతో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఎమ్మెల్యేలందరూ రాంచీకి చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) శనివారం ఈడీ(ED) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం ఇంటి ఎదుట సోరెన్ అభిమానులు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ప్రభుత్వం చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పరిస్థితిపై చర్చించేందుకు అధికార జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పనా సోరెన్‌కు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేసుల విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్(CM Kejriwal) కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemanth Sorean)కు ఈడీ జారీ చేసిన సమన్లను పాటించడానికి ఇరువురు నిరాకరించారు. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను విచారణకు పిలవగా.. ఆయన వెళ్లకపోవడంతో ఈడీ ఆయన సన్నిహితుల నివాసాలపై దాడులు చేస్తోంది.