Home » High Court
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ఓ విద్యార్థిని డెహ్రాడూన్లోని సైనిక పాఠశాలకు రాష్ట్ర కోటాలో ఎంపిక చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం అతడు స్థానికుడు కాదంటూ.. స్థానిక కోటా కింద ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు అనుమతించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ ఉప్పల్ మండల పరిధిలోని రామంతపూర్ పెద్దచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు విఫలమవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) కేసులో హైకోర్టు షాకిచ్చింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపి, పిటిషన్లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులపై కేసు నమోదు చేయాలని గుంటూరులో రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన గుంటూరు నగరపాలెం పోలీసులు.. విజయపాల్తో పాటు అప్పటి సీఎం జగన్, సీఐడీ డీజీ సునీల్, ప్రభుత్వాసుపత్రి.. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్ వేశారు.
అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.
దేశంలోని ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జులై 11న చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని సవరిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడంతో ఈ నియామకాలు జరిగాయి.
నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించినవారు కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.