Home » Himachal Pradesh
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.
హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కాంగ్రెస్ నేతత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులకు అండగా నిలవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఆపిల్ పండ్లను రైతులు కాలువల్లో పారబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల కోసం రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకుంటారని, వాస్తవంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలవడం లేదని దుయ్యబట్టింది.
ఎంత బట్టీ కొట్టించినా 60 తెలుగు సంవత్సరాల పేర్లలో సగం కూడా చెప్పలేని వారు యువన్ తెలివి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.
యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.
భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదైదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది.
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.