Home » Hyderabad
సర్కారు నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో ‘రైతు దినోత్సవ సభ’ను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువ చేసే భూమి. పైగా మధ్యతరగతికి చెందినవారి చేతిలో ఉంది. ఇంకేం..! భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగాహిల్స్ వెంచర్ విషయంలో ఇదే జరిగింది.
ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు.
గుంటూరు పట్టణం చుట్టుగుంటకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వంశీ శ్రీనివాస్ దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఎస్కార్ట్ వాహనంలో శుక్రవారం మధ్యాహ్నం ఎవ్వరూ లేని సమయంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
పారిశ్రామికవేత్త అదానీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంచు భూమీ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. నేరం రుజువైతే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
నగరంలో చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది హైడ్రా. ఏ క్షణం ఎక్కడ వాలిపోతుందో.. ఎవరి ఇల్లు కూలగొడుతుందోననే భయాందోళనతో ఉన్నారు.
‘దాచేస్తే దాగని సత్యం.. చెరిపేస్తే చరగని చరిత్ర.. కేసీఆర్ తెలంగాణ లో సాధించిన నీలి విప్లవం’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల పెంపకం నుండి 2023-24 గుకు 4.39 లక్షల టన్నులు ఎగబాకిన వైనమని అన్నారు. తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ‘ఇన్ ల్యాండ్ స్టేట్’ గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమని వ్యా్ఖ్యానించారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(CPM State Secretary Tammineni Veerabhadram) తెలిపారు.
ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గుండె జబ్బుతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందంటూ బంధువులు ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు.