Home » Hyderabad
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ఎవరా నటి అనేది ఇప్పుడు చూద్దాం..
మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. కొన్ని రోజులుగా మూసీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నాయి.
నాగార్జున సాగర్కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధించడం మెుదలుపెట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
Telangana: ‘‘నాకు ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నను కలిశాను. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో కుటుంబ వివాదాన్ని ఇద్దరం పరిష్కరించాము. నేను ఇచ్చిన రెండు ఫోన్ నంబర్లు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు వివరణ కోరారు’’ జైపాల్ యాదవ్ తెలిపారు.
Telangana: లగచర్ల దాడి ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. లగచర్ల దాడిలో పోలీసులు మొత్తం 47 మంది నిందితులను గుర్తించగా.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మరో 21 మందిని రిమాండ్ చేశారు. తాజాగా
Telangana: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ విమానంలో బాంబు పెట్టారంటూ కాల్ రావడంతో అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్కు వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
హిందువులంతా పవిత్రమైన మాసంగా భావించే కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం అయ్యప్పస్వామి మాలధారణ. కార్తీకమాసంలో అయ్యప్ప స్వామి(Ayyappa Swami) భక్తులు మాలలు ధరించి అయ్యప్పస్వామి దేవాలయాన్ని, మకర జ్యోతిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని ఆపార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కార్తీక పౌర్ణమి ప్రభావం పడింది. పండుగ నేపథ్యంలో దాదాపు 30 శాతం మంది ఎన్యూమరేటర్లు(Enumerators) శుక్రవారం విధులకు రాలేదని జీహెచ్ఎంసీ(GHMC) వర్గాలు పేర్కొన్నాయి. మహా నగరంలో సర్వే ప్రారంభించినప్పటి నుంచి ప్రతిరోజు 1.30 లక్షల నుంచి 1.45 లక్షల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల నియంత్రణ విధులు నిర్వహించేందుకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీరిని నియమించాలని సూచించారు.