Share News

Hyderabad: నగరంలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం..

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:01 PM

నాగార్జున సాగర్‌కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధించడం మెుదలుపెట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

Hyderabad: నగరంలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం..

హైదరాబాద్: ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించకపోయినా, తాము చెప్పినట్లు వినకపోయినా మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేయసిని విదేశాలకు పంపించాడనే కారణంగా ఆమె తండ్రిపై ప్రేమికుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన మరవక ముందే నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్ చేస్తానంటూ విద్యార్థినిపై బెదిరింపులకు దిగాడు ఓ దుర్మార్గుడు. ప్రతి రోజూ బెదిరిస్తూ యువతి నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసి జల్సాలు చేశాడు. రోజూ ఆమె వెంట పడుతూ చదువుకోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.


నాగార్జున సాగర్‌కు చెందిన చెరుకుపల్లి విజయ్ కుమార్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినికి పరిచయం అయ్యాడు. మెుదట స్నేహితుడిగా ఉంటానని చెప్పి తర్వాత ప్రేమ పేరుతో వేధించడం మెుదలుపెట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరూ సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫొటోలు, వీడియోలను అందరికీ చూపిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని బోరున విలపించింది. ప్రేమ పేరుతో వెంట పడుతూ నవంబర్ 11న కాలేజీ నుంచి వస్తున్న సమయంలో బలంవతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని తెలిపింది. అనంతరం తనపై అత్యాచారం చేశాడని విద్యార్థిని కన్నీటి పర్యంతం అయ్యింది.


కొంతకాలంగా తన తల్లిదండ్రులకు సైతం ఫోన్లు చేస్తూ చంపేస్తానని బెదిస్తున్నాడని నర్సింగ్ విద్యార్థిని చెప్పింది. బంధవులకు సైతం కాల్స్ చేస్తూ తనను చంపేస్తానని వారినీ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ప్రతి రోజూ కాలేజీ నుంచి వస్తున్న సమయంలో వెంట పడుతూ కొడుతున్నాడని తెలిపింది. శుక్రవారం సాయంత్రం కూడా నేరుగా తన ఇంటి కొచ్చి మరీ తల్లిదండ్రులపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విజయ్ కుమార్ నుంచి తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ హయత్ నగర్ పోలీసులను యువతి ఆశ్రయించింది. అతను మరికొంత మంది అమ్మాయిలను సైతం ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విద్యార్థిని ఆరోపించింది. ఇదే విషయమై నాగార్జునసాగర్‌లో గతంలో ఫిర్యాదు చేయగా కేసు కూడా నమోదు అయ్యిందని బాధితురాలు వెల్లడించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Phone Tapping: పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే

TG NEWS: బీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయి.. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం

Updated Date - Nov 16 , 2024 | 03:02 PM