Home » HYDRA
బీఆర్ఎస్ విధానం నిర్మాణాలయితే కాంగ్రె్‌సది విధ్వంసమని, తాము నిర్మిస్తే వారు కూల్చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది.
రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా చర్యలపై ఓవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడం, మరోవైపు బాధితుల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూల్చివేతలపై సమీక్షించుకోవాలన్న సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.
హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది.
నగరంలో అక్రమ నిన్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా.. రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి.. అక్రమ కట్టడాలన్నీ కూల్చిపడేస్తున్నారు. చూస్తుండగానే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలని అన్నారు..లేకపోతే పర్యవసానం తప్పదని హెచ్చరించారు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలతో స్థానికుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటికే వరుసగా కూల్చివేతలు జనుగుతుండడంతో బుల్ డోజర్లు తమ ఇళ్లమీదకి ఎప్పుడొస్తాయోనని తీవస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో చెరువులు, నాలాలను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. అందులోభాగంగా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోని పలు భవనాలను ఇప్పటికే హైడ్రా నేలమట్టం చేసింది.
ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది.