Share News

Minister Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై మంత్రి పొన్నం ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:50 PM

రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకొని వాస్తవ విమర్శ చేయాలని అన్నారు..లేకపోతే పర్యవసానం తప్పదని హెచ్చరించారు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Minister Ponnam Prabhakar: మూసీ అక్రమ నిర్మాణాలపై  మంత్రి పొన్నం  ఏమన్నారంటే..

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మూసీ ప్రజలకు 10వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకటించారని గుర్తుచేశారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణసెక్రటేరియట్ మీడియా పాయింట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... అధికారంలో ఉంటే ఒకలా.. అధికారం కోల్పోతే మరోలా తాము మాట్లాడమని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.


ALSO READ: Hyderabad: టెన్షన్.. టెన్షన్..! ఆపరేషన్‌ మూసీతో గ్రేటర్‌ వ్యాప్తంగా ఆందోళన

మూసీ రివర్ బెడ్ నివాసాల సర్వే జరుగుతుందని.. అక్రమ కట్టడాలు అయినా.. ఇళ్లను కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంది అని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నీళ్లు ఒక్క టీఎంసీ అయినా తెచ్చారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు.


2014 వరకు 25 STPలు ఉన్నాయన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణకు చేసింది ఏంటంటే శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని అన్నారు. గతంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు వస్తే రూ. 10వేలు బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే పంచి చేతులు దులుపుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.


సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తే చర్యలు..

‘‘ప్రజలపై మాజీ మంత్రి కేటీఆర్‌కు ప్రేమ ఉంటే నన్ను కలిసి మీ అభిప్రాయం పంచుకోండి. రాబోయే రోజుల్లో రూ. 5500 కోట్లతో మూసీకి గోదావరి నీరు తెచ్చే ఆలోచన చేస్తున్నాం. ఒళ్లు, నాలుక దగ్గర పెట్టుకుని వాస్తవ విమర్శ చేయాలి. లేదంటే పర్యవసానం తప్పదు. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీలు తాన అంటే తందాన అని అంటున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ - బీఆర్ఎస్ పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు

Harishrao: సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయను: మాజీ మంత్రి హరీష్ రావు

CM Revanth Reddy: కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటే.. డిపార్టుమెంటే ఉండదు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 06:36 PM