Home » HYDRA
హై‘డ్రామా’లు పక్కన పెట్టి హైదరాబాద్ బాగుచేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)’కు మొత్తం 169 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్ళనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డిప్యూటీ ఈఈ)లను డిప్యూటేషన్పై పంపించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన ‘హైడ్రా’ మరోసారి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన రూ.కోట్ల విలువైన విల్లాలను నేలమట్టం చేస్తోంది.
చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు... మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు.
Telangana: గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Telangana: ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా..
ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు.. 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది.. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది.. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా .. పేక మేడల కూల్చివేయబడిందంటూ హైడ్రాపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.