Share News

Kunamneni హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు

ABN , Publish Date - Sep 24 , 2024 | 04:35 PM

Telangana: గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

Kunamneni హైడ్రాపై ప్రభుత్వానికి సీపీఐ నేత హితవు
CPI Leader Kunamneni Sambashiva rao

హైదరాబాద్, సెప్టెంబర్ 24: హైడ్రా (HYDRA) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీపీఐ సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiava Rao) పలు సూచనలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా పేరిట ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హితవుపలికారు. గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేకమంది పేదలు నివాసం ఉంటున్నారని తెలిపారు. మూడు భాగాలుగా పేద వారు, మధ్య తరగతి, సంపన్నులను గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలు పెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలకు దారి తీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సీపీఐ ఆధ్వర్యంలో సిటీలో అనేక చోట్ల చాలామంది పేదలు ఇళ్ళు కట్టుకున్నారని.. అలాంటి వాళ్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసి వ్యవహరించాలన్నారు.

Rain Alert: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షం..


ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశతో నాగార్జునసాగర్ కెనాల్‌కు రెండు చోట్ల గండి పడడం వాస్తవమన్నారు. ‘‘నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంతో పాటు మన జిల్లాకు కూడా నీళ్లు అందించా. మా హయాంలో సాగర్ కాలువకు గండి పడితే ఏడు రోజుల్లో పూర్తి చేశాం.. ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదు. మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలు పెట్టిండ్రు. వాళ్ల తప్పులపై ప్రశ్నించిన.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు’’ అని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


హైడ్రా సంచలన నిర్ణయం..

రాష్ట్రంలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతల్లోె జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న హైడ్రా (HYDRA) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. బ్యాంకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. లీగల్ టీంను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.


ఇవి కూడా చదవండి..

KTR: సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల పేరుతో కుట్రకు తెర లేపారు

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 24 , 2024 | 04:35 PM