Share News

CM Revanth Reddy : చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై హైడ్రాకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 24 , 2024 | 08:58 PM

చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు... మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశించారు.

CM Revanth Reddy : చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై హైడ్రాకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ( మంగళవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ హజరయ్యారు.


ALSO READ: KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.


ALSO READ: Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు

మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు..

అంతకుముందు సెక్రటేరియట్‌లో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్,హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీ ఒడ్డున కూల్చి వేతలు ప్రభుత్వం పక్షాన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. కూల్చివేతల సందర్భంగా నివాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాత...హైడ్రాను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ కామెంట్స్..

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 24 , 2024 | 09:58 PM