Home » HYDRA
మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్ప చెరువు ఎఫ్టీఎల్ నిర్మించిన షెడ్లు, ఇండస్ట్రీస్ నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు. అయితే కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారంటూ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆందోళనకు దిగారు.
బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగించవద్దని, నూతన నిర్మాణాల విషయంలో అలాగే ముందుకు వెళ్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హైకోర్టు తెలిపింది.
ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.
‘‘సర్.. మా ప్రాంతంలో రోడ్డు, నాలాను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. వర్షం నీరు బయటకు వె ళ్లడం లేదు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 12 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు.
హైడ్రా బుల్డోజర్ల తదుపరి అడుగులు హిమాయత్‌సాగర్ వైపేనా..? జలాశయం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న ప్రముఖుల అతిథిగృహాలు, ఇతర ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమవుతోందా..?
ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపునకు ఇక ‘హైడ్రా’ ద్వారానే నోటీసులు జారీ చేయించనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
హైడ్రా పేరిట అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు.