Share News

Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:53 PM

తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. అందులోభాగంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైడ్రాపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు.

Batti Vikramarka: ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా లేదు

హైదరాబాద్, అక్టోబర్ 07: తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. అందులోభాగంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైడ్రాపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు. హైడ్రా పేరుతో తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఆయన మండిపడ్డారు. హైడ్రాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Also Read: Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు


హైదరాబాద్ అంటనే.. రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. అలాగే నగరానికి మూసి నది మణిహారంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. నగరంలో చాలా చెరువులు, పార్కులు, కబ్జాకు గురయ్యాయన్నారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ కోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


కొన్నేళ్లుగా కబ్జాలతో హైదరాబాద్‌లో చెరువులు మాయమైనాయన్నారు. చెరువుల అక్రమణతో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ప్రజా అజెండా తప్పా.. వ్యక్తిగత అజెండా అనేది తమకు లేదని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలో ఎవరికీ వ్యక్తిగత అజెండాలు అనేవే లేవని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


హైదారబాద్ నగరంలోనే కాదు.. మూసి నది పరివాహక ప్రాంతంలో అక్రమణలను సైతం రేవంత్ రెడ్డి సర్కార్ తొలగిస్తుంది. ఆ క్రమంలో పేదలు, మధ్యతరగతి వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో విపక్షాలు సైతం స్పందించాయి. అందులోభాగంగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ సైతం స్పందించారు. అందులోభాగంగా రేవంత్ రెడ్డికి ఆదివారం ఎంపీ ఈటల బహిరంగ లేఖ రాశారు.


ఈ లేఖలో హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ దూకుడు మీద వెళ్తుందంటూ ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం హైడ్రాపై కీలక ఆరోపణలు చేశారు. మరో విపక్షం బీఆర్ఎస్ నేతలు అయితే.. హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు. అలాంటి వేళ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కపై విధంగా స్పందించారు.

For Telangan News And Telugu News...

Updated Date - Oct 07 , 2024 | 04:01 PM