Home » IAS
ఏపీలో ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కొరడా ఝుళిపించింది. ముగ్గురు కలెక్టర్లపై సీఈసీ మంగళవారం నాడు వేటు వేసింది. కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా పై వేటు పడింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోపు బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. వీరి స్థానంలో వెంటనే ప్యానల్ పంపాలని కూడా ఆదేశించింది.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు రాగా.. ఒకరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ఐఏఎస్ నియమితులయ్యారు.
ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. ఇప్పటికే ఇంతియాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైతం వచ్చారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్ చేరారు. తాజాగా ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురికి స్థాన చలనం కలిగిస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవి..
Telangana Govt Transfers IAS And IPS Officials : అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్, ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే..
ఐఏఎస్ ( IAS ), ఐపీఎస్ ( IPS )ల కేడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విచారణ చేపట్టింది. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.