Share News

TS High Court: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ కేటాయింపుపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Jan 02 , 2024 | 08:22 PM

ఐఏఎస్ ( IAS ), ఐపీఎస్‌ ( IPS )ల కేడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విచారణ చేపట్టింది. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.

TS High Court: ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ కేటాయింపుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ఐఏఎస్ ( IAS ), ఐపీఎస్‌ ( IPS )ల కేడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విచారణ చేపట్టింది. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. కొంతమంది అధికారులకు కేవలం రెండు మూడేళ్లు మాత్రమే సర్వీస్ ఉందని హైకోర్టు తెలిపింది. కేడర్ కేటాయింపు విషయన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారుల సర్వీస్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Updated Date - Jan 02 , 2024 | 08:22 PM