Home » ICC
ఆసియా కప్ ఫైనల్లో ఒంటి చేతితో టీమిండియాను గెలిపించిన స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 8 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు.
ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ తరఫున గిల్ టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు.
వన్డే ప్రపంచకప్ కోసం మరికాసేపట్లో భారత జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. భారత్ వేదికగా జరిగే ఈ ప్రపంచకప్ కోసం జట్లన్నీ తమ ఆటగాళ్ల వివరాలను ఐసీసీకి అందించడానికి సెప్టెంబర్ 5 చివరి తేదీగా ఉంది.
వెస్టిండీస్‌పై గడ్డపై టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. తొలి 3 టీ20ల్లో వరుసగా 39, 51, 49 పరుగులతో రాణించిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 46వ స్థానానికి చేరుకున్నాడు.
భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లపై బీసీసీఐ, ఐసీసీ కీలక ప్రకటన చేశాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల టికెట్లు ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించాయి.
అనుకున్నదే జరిగింది. వన్డే ప్రపంచకప్‌లో(ICC ODI World Cup 2023) భాగంగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ(ICC) అధికారికంగా ప్రకటించింది.
ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల జట్టు ఎంపిక తీరు పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి. 114 పరుగులు ఛేజ్ చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్ వంటి జట్టు మీదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.
బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌పై ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.