Share News

World Cup 2023: రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఐసీసీ ఒప్పందం.. అందుకోసమే!

ABN , First Publish Date - 2023-10-16T17:44:32+05:30 IST

ప్రస్తుతం పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నడుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫమ్ టికెట్’ (ConfirmTkt)తో ఓ కీలక ఒప్పందం...

World Cup 2023: రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఐసీసీ ఒప్పందం.. అందుకోసమే!

ప్రస్తుతం పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నడుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫమ్ టికెట్’ (ConfirmTkt)తో ఓ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వరల్డ్ కప్ కోసం ఐసీసీ అధికారిక లైసెన్స్‌దారుగా మారినట్లు ఆ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. క్రికెట్ పట్ల ఎక్కువ మక్కువ కలిగిన ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, నమ్మకమైన ప్రయాణం కోసం ఈ డీల్ కుదిరినట్టు ఆ సంస్థ వెల్లడించింది. వేవ్‌మేకర్ ఇండియా అనే మీడియా ఏజెన్సీ సహకారంతో ఈ భాగస్వామ్యం కుదిరింది.


చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఐసీసీ ఒక రైల్వే ప్లాట్‌ఫామ్‌తో ఇలాంటి డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో.. ConfirmTkt తన యాప్‌లో కొన్ని పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్‌లతో పాటు ఇతర సోషల్ మీడియా ఛానెల్‌లోనూ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులతో పాటు తన వినియోగదారులతో సన్నిహితంగా ఉండేందుకు ConfirmTkt ‘జర్నీ టు ది వరల్డ్ కప్’ అనే ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. ఈ ప్రచారం కింద ConfirmTkt రెండు ఉత్కంఠభరితమైన పోటీలను నిర్వహిస్తుంది. ఇందులో విజయం సాధించిన వారికి ఎన్నో ఉత్తేజరమైన బహుమానాల్ని ఆ సంస్థ అందించనుంది. జోర్డిండియన్, డానిష్ సైత్, భారత్ ఆర్మీలతో పాటు ఇతర ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి ఈ వరల్డ్ కప్ ప్రయాణంలో పాల్గొనే సువర్ణకాశాన్ని కల్పిస్తుంది.

ఈ సందర్భంగా ConfirmTkt సహ-వ్యవస్థాపకులు దినేష్ కుమార్ కోఠా & శ్రీపాద్ వైద్య మాట్లాడుతూ.. మన దేశంలో క్రికెట్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, మన సంస్కృతిలో ఒక భాగమని అన్నారు. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023 అధికారిక లైసెన్స్ పొందినందుకు తాము సంతోషంగా ఉన్నామని, క్రికెట్ అభిమానులకు మరపురాని అనుభవాల్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఐసీసీతో తమ భాగస్వామ్యం.. ప్రపంచ కప్ కోసం భారతదేశ స్ఫూర్తిని జరుపుకోవడానికి, అభిమానులను వారి క్రికెట్ దిగ్గజాలకు మరింత చేరువ చేయడానికి అనుమతి ఇస్తుందన్నారు. ఈ జర్నీ టు ద వరల్డ్ కప్‌లో భాగంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులతో కలిసి తమ అనుభవాల్ని పంచుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు.

Updated Date - 2023-10-16T17:44:32+05:30 IST