Home » INDIA Alliance
ఈ ఎన్నికల్లో ఎలాగైన అధికారం అందుకోవాలని ప్రధాని మోదీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియా గాంధీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు.. మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీతోపాటు ఆయన పార్టీపై సోనియాగాంధీ గాంధీ మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఏకపక్ష తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections 2024) భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
కేంద్రంలో ప్రతిపక్షం ఇండియన్ నేషనల్ డెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్ (ఇండియా కూటమి) అధికారంలోకి వస్తే... కోటి ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే రూ. 500కే సిలండర్ దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు.
బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
బీజేపీ నేతలను ''దోపిడీదారులు''గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అభివర్ణించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ ఒకే వ్యక్తి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఒక 'సింహం' అని, ప్రభుత్వం ఎంతోకాలం ఆయనను జైలులో ఉంచలేదని సునీతా కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేజ్రీవాల్ రాజీనామా చేయాలా అని 'ఇండియా' బ్లాక్ 'మహా ర్యాలీ'ని ఉద్దేశించి ఆమె ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లకు సంఘీభావంగా ఆదివారంనాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగనున్న ఆప్ 'మహార్యాలీ' లో 'ఇండియా' కూటమికి చెందిన ప్రముఖ నేతలు పాల్గోనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీయే(NDA), ఇండియా కూటమి పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఇండియా కూటమి(INDIA Bloc) మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 'మహా ర్యాలీ' నిర్వహించనుందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.